: విభజన త్వరగా పూర్తి చేయండి: నారాయణ
విభజన ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ రాష్ట్రపతిని కోరారు. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీమాంధ్ర ప్రాంతానికి రాజధాని ఏర్పాటు చేసేందుకు పెద్ద మొత్తంలో నిధులను కోరామన్నారు. అలాగే రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు. తెలంగాణ విషయంలో మిగతా పార్టీలు వెనకడుగు వేసేలా కనిపిస్తోందని, తాము మాత్రం తెలంగాణకు కట్టుబడే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.