: నోకియా 106 మొబైల్ @ రూ. 1,399
1399 రూపాయలకే నోకియా చౌక ఫోన్ 106ను విడుదల చేసింది. ఇది సింగిల్ సిమ్. అది కూడా మినీ సిమ్ ను మాత్రమే సపోర్టు చేస్తుంది. 10 గంటల టాక్ టైమ్ నిచ్చే 800 మిల్లీ యాంపీ అవర్స్ బ్యాటరీ, 1.8 అంగుళాల స్క్రీన్, ఎఫ్ఎం రేడియో సదుపాయాలు ఉన్నాయి. ఎరుపు, నలుపు, తెలుపు రంగుల్లో ఇది లభిస్తోంది. ఇప్పుడు ఎక్కువ మంది డ్యుయల్ సిమ్ వాడడం సాధారణమైపోయింది. దానికి భిన్నంగా నోకియా సింగిల్ సిమ్ ఫోన్ ను విడుదల చేయడం విశేషం.