: రాష్ట్రపతికి అన్నీ తెలుసు: డీఎస్


రాష్ట్ర విభజనపై ఎవరికైనా అభ్యంతరాలుంటే కేంద్ర ప్రభుత్వానికి చెప్పుకోవాలేకాని... విభజనను అడ్డుకోవడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ తెలిపారు. ఈ రోజు ఆయన హైదరాబాదులో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ఇరు ప్రాంత ప్రజల మనోభావాలను అర్థం చేసుకున్నారని డీఎస్ చెప్పారు. ఆయనకు అన్నీ తెలుసని... ఆయనకు ఎవరూ ఏదీ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. టీబిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగాలని... తెలంగాణవాసుల హక్కులను హరించరాదని కోరారు. తెలంగాణ ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని... 2014 ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని జోస్యం చెప్పారు. రాష్ట్రపతితో తాను చర్చించిన విషయాలను మీడియాతో పంచుకోలేనని తెలిపారు.

  • Loading...

More Telugu News