: తెలంగాణ బిల్లు సీమాంధ్ర నేతలు చించడం సరికాదు: విద్యాసాగర్ రావు
తెలంగాణ బిల్లును సీమాంధ్ర నేతలు అసెంబ్లీలో చించడం సరికాదని బీజేపీ నేత, మాజీ మంత్రి సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టి, పార్లమెంటులో ఆమోదించేలా చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. బిల్లు చించిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులను సభనుంచి బయటకు పంపించివేయాలని ఆయన డిమాండ్ చేశారు.