: దేవయాని వ్యవహారంలో యూఎస్ రక్షణ శాఖ సీరియస్


భారత దౌత్యాధికారిణి దేవయాని ఖోబ్రగడే ఉదంతం అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దేవయాని అరెస్ట్ పై పెద్దన్ననే ధిక్కరించిన భారత్... మన దేశంలోని అమెరికా దౌత్యాధికారుల విషయంలో ఉక్కుపాదం మోపింది. దీంతో, తేరుకున్న అమెరికా అంతర్గత దర్యాప్తుకు ఆదేశించింది. ఈ దర్యాప్తు టీంలో వైట్ హౌస్ కు చెందిన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, జస్టిస్ డిపార్టుమెంటులు ఉన్నాయి.

దీనికి తోడు ఈ వ్యవహారంలో మరో ముఖ్యమైన మలుపు ఏంటంటే... అమెరికా రక్షణ శాఖ ఈ కేసుకు సంబంధించి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో బలమైన శక్తిగా ఉన్న భారత్ విషయంలో ప్రవర్తించిన తీరును ఎండగట్టింది. భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే... ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రక్షణ పరంగా వ్యూహాత్మకంగా వ్యవహరించడం కష్టమవుతుందని అభిప్రాయపడింది. దీని పర్యవసానం భవిష్యత్తులో అంతులేని నష్టాలకు కారణమవుతుందని తెలిపింది. వీలైనంత త్వరలో ఈ కేసుకు ముగింపు పలకాలని సీరియస్ గా చెప్పింది.

  • Loading...

More Telugu News