: విదేశాల్లో గత మూడేళ్లలో 432 మంది భారత పౌరులు అదృశ్యం: కేంద్రం వెల్లడి


విదేశాల్లో భారతీయులకు సరైన రక్షణ లేదన్న విషయం కేంద్రం తాజా ప్రకటనతో స్పష్టమవుతోంది! గత మూడేళ్లలో విదేశాల్లో 432 మంది భారత పౌరులు అదృశ్యమయ్యారని కేంద్రం ఈరోజు ప్రకటించింది. అయితే వీరిలో 141 మంది ఆచూకీ నేటికీ లభ్యం కాలేదని విదేశీ వ్యవహారాల మంత్రి వాయలార్ రవి వెల్లడించారు.

లోక్ సభలో అడిగిన ఓ ప్రశ్నకు జవాబుగా ఆయన ఈ విషయాలు తెలిపారు. 2010 నుంచి 2012 మధ్య కాలంలో 18 దేశాల్లో భారతీయులు అదృశ్యం అయ్యారని రవి పేర్కొన్నారు. వారిలో 291మంది ఆచూకీ దొరికిందని మంత్రి చెప్పారు. 

  • Loading...

More Telugu News