: ఇది అత్యవసర సమయం... ఆస్తులు అమ్మి అయినా పార్టీని గెలిపించుకుందాం: బాబు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తల్లో నిస్తేజాన్ని పారదోలే పనిలో నిమగ్నమయ్యారు. కార్యకర్తలకు ఇది అత్యవసర సమయంలాంటిదని, ఆస్తులు అమ్మి అయినా సరే పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతిక్షణం పార్టీ హితమే ఆలోచించాలని, పార్టీకి మళ్లీ వైభవాన్ని చేకూర్చే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపైనా ఉందని బాబు పేర్కొన్నారు.
ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్న బాబు... ఉండి, భీమవరం కార్యకర్తలతో పాలకొల్లు మండలం పూలపల్లి వద్ద సమావేశమయ్యారు. ఎమ్మెల్యే కలిదిండి శివరామరాజు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన పలువురికి బాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.