: పదేళ్ల కాంగ్రెస్ పాలనతో ప్రజలంతా విసిగిపోయారు: యనమల
పదేళ్ల కాంగ్రెస్ పాలనతో ప్రజలంతా విసిగిపోయారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. తెలుగుదేశం పరిపాలన కోసం అందరూ ఎదురు చేస్తున్నారని తెలిపారు. తిరుపతిలో జరిగిన తెలుగుదేశం ప్రజా గర్జన సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధినంతా కాంగ్రెస్ పాలనలో నాశనం చేశారు.