: కేజ్రీవాల్ న్యూ ట్రెండ్ సృష్టించాలి: అన్నా హజారే
ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తన శిష్యుడు కేజ్రీవాల్ కు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మార్గ నిర్దేశం చేశారు. ప్రజలు మెచ్చే మంచి పనులు చేసి రాజకీయాల్లో కేజ్రీవాల్ న్యూ ట్రెండ్ సృష్టించాలని మనసారా ఆకాంక్షించారు. రాజకీయాల్లోని బురదను ఊడ్చేస్తామని కేజ్రీవాల్ చెప్పడం హర్షించదగ్గ విషయమని అన్నారు.