: కేజ్రీవాల్ యాక్షన్ స్టార్ట్
సామాన్యుల నేతనని, ప్రజా సేవకుడినని చెప్పుకోవడమే కాదు.. దాన్ని కేజ్రీవాల్ ఆచరణలో పెడుతున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే చర్యలను ప్రారంభించారు. 9 మంది ప్రభుత్వ అధికారులను బదిలీ చేశారు. వారిలో ఢిల్లీ జలబోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి కూడా ఉన్నారు. తమకు అధికారమిస్తే రోజూ 700 లీటర్ల నీటిని సరఫరా చేస్తామని, విద్యుత్ చార్జీలను సగానికి తగ్గిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాన్ని నెరవేర్చే క్రమంలో సమర్థత ప్రధానాంశంగా అధికారుల బదిలీ జరిగింది. బదిలీ అయిన వారిలో విద్యుత్, విద్యా, ఆర్థిక విభాగం అధికారులు కూడా ఉన్నారు.