: గుంటూరులో బీహార్ విద్యార్థులపై దాడి
గుంటూరు సమీపంలోని యనమదలలో ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న బీహార్ విద్యార్థులపై దాడి జరిగింది. ముసుగు ధరించి వచ్చిన కొందరు కాలేజీ హాస్టల్లోకి ప్రవేశించి రాడ్లతో గత రాత్రి దాడి చేయగా నలుగురు బీహార్ విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. వీరిని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. స్థానిక విద్యార్థి సెల్ ఫోన్ చోరీ జరగడమే దాడికి కారణంగా భావిస్తున్నారు.