: రాష్ట్ర ఎంపీ స్థానాలకు పరిశీలకులను నియమించిన కాంగ్రెస్ హై కమాండ్
వచ్చే 2014 సాధారణ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. వచ్చే ఏడాది పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేని పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని 42 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలకులను నియమించింది. జనవరి మొదటివారం నుంచి వారు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి.. అభ్యర్ధుల ఎంపిక, పార్టీ పరిస్థితిపై నివేదికలు అందిస్తారు. అనంతరం గెలిచే అవకాశమున్న అభ్యర్ధుల జాబితాను కూడా రూపొందించి అధిష్ఠానానికి అందజేయనున్నారు.