: ముఖ్యమంత్రి పదవిస్తే ఏడాదిలో హైదరాబాద్ కు కృష్ణా జలాలు: కిషన్ రెడ్డి
తనకు ముఖ్యమంత్రి పదవిస్తే సంవత్సరం తిరిగేలోగా హైదరాబాద్ నగరానికి కృష్ణా జలాలు తెస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణా జలాల మూడో దశ పనుల్లో సీఎం సోదరుడిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. ఇక శాసనసభ బడ్జెట్ సమావేశాలపై మాట్లాడుతూ, సర్కారు చెప్పమన్న అసత్యాలను గవర్నర్ వల్లెవేసినట్టుందని విమర్శించారు.