: వారంతా మోడీకి క్షమాపణలు చెప్పాలి: కిషన్ రెడ్డి


గుజరాత్ లో గోద్రా అల్లర్లు చెలరేగినప్పుడు అరిచి గీపెట్టి మరీ మోడీని విమర్శించిన నేతలంతా... ఇప్పుడు బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ గుజరాత్ అల్లర్లు జరిగిన నాటి నుంచి మోడీని విమర్శిస్తూ వచ్చారని... తాజాగా కోర్టు మోడీకి క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో వారు క్షమాపణలు కోరాల్సిందేనని అన్నారు. గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశంలో అవినీతి ఏరులై పారుతుంటే, రాహుల్ గాంధీ ఎక్కడున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను శాసనసభ, పార్లమెంటుల్లో చర్చిస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News