: తొలి రోజు కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాలు
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రభుత్వ వ్యవహారాల్లో తనదైన ముద్రను వేసేందుకు కేజ్రీవాల్ ప్రయత్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన విధంగా... మంత్రులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఎర్రబుగ్గలు వినియోగించకూడదని నిర్ణయించారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అధికారులకు ఎస్కార్ట్ వాహనాలను సమకూర్చాలని ఆయన ఆదేశించారు. దీనికి తోడు, ముఖ్యమంత్రిగా తనకు గానీ, తన మంత్రివర్గ సహచరులకు కానీ విశాలమైన భవంతులు అవసరం లేదని కేజ్రీ స్పష్టం చేశారు.