: అవినీతి పునాదులపై పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ: సోమిరెడ్డి


వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. సమైక్య ముసుగులో జగన్ విభజనకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర సమైక్యతపై మాట్లాడే హక్కు జగన్ కు లేదని చెప్పారు. అవినీతి పునాదులపై పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ అని అన్నారు. క్విడ్ ప్రోకో అనే పదం జగన్ వచ్చిన తర్వాతే బయటకు వచ్చిందని ఎద్దేవా చేశారు.

జగన్ కేసును విచారించిన సీబీఐ పూర్వ జేడీ లక్ష్మినారాయణకు ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ తో జగన్ కు మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నందునే లక్ష్మినారాయణకు పోస్టింగ్ రాలేదని చెప్పారు. జగన్ కు దమ్ముంటే సోనియా ఇంటి ముందు ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. గొంతెమ్మ కోర్కెలు మాని సమైక్య రాష్ట్రం కోసం చిత్త శుద్ధితో పని చేయాలని జగన్ కు సూచించారు.

  • Loading...

More Telugu News