: ప్రమాద ఘటనపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపిస్తాం: రైల్వే మంత్రి
నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగి ఏసీ బోగీ కాలిపోయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో, రైలు ప్రమాద స్థలిని కేంద్ర రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే పరిశీలించారు. ప్రమాద ఘటనపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపిస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటి వరకూ తొమ్మిది మృత దేహాలను గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించామని ఆయన చెప్పారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇస్తామని ఆయన ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందించి, వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తామన్నారు. ప్రయాణికులు రైలులో లిక్కర్, పేలుడు పదార్థాలు తీసుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకొంటామని ఖర్గే పేర్కొన్నారు.