: జనవరి 2నుంచి సీమాంధ్రలో బంద్ కు ఏపీఎన్జీవోల పిలుపు
కొత్త సంవత్సరంలో రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ జరగనున్న నేపథ్యంలో ఏపీఎన్జీవోలు రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు జనవరి 2 నుంచి 10 వరకు సీమాంధ్రలో బంద్ లు జరుగుతాయని హైదరాబాదు ఏపీఎన్జీవో భవన్ లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. 3న రాష్ట్ర బంద్ కు పిలుపు నిచ్చారు. 4న జిల్లాల్లో సమైక్య మానవహారాలు, 5న ఉపాధ్యాయుల ర్యాలీలు, అనంతర రోజుల్లో విద్యార్ధుల రిలే నిరాహార దీక్షలు, ప్రభుత్వ ఉద్యోగుల దీక్షలు, రైతుల నిరసన దీక్షలు, మహిళల నిరసనలు జరుగుతాయని కార్యాచరణ ప్రకటించారు. అయితే, అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని అశోక్ బాబు తెలిపారు.