: బిల్లుపై ఓటింగ్ ప్రసక్తే రాకూడదు: పొన్నాల
శాసన సభలో తెలంగాణ బిల్లుపై ఓటింగ్ ప్రసక్తే రాకూడదని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ జరగడానికి అవకాశం లేదని అన్నారు. ఈ బిల్లు కేంద్ర మంత్రి వర్గం తీసుకువచ్చిందని, దానిని రాష్ట్రపతి అసెంబ్లీకి పంపించారని.. దానిపై ఓటింగ్ అంటూ జరిగితే పార్లమెంటులోనే జరుగుతుందని అన్నారు. శాసనసభలో బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకునే వారంతా చరిత్ర హీనులవుతారని మంత్రి పొన్నాల తెలిపారు.