: వచ్చే వారం నుంచి జిల్లాల్లో బొత్స పర్యటన
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ వచ్చే వారం నుంచి పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు జనవరి మొదటి వారంలో డీసీసీ సమావేశాలు ఏర్పాటుచేసి... పార్టీని వీడే ఎమ్మెల్యేల స్థానాల్లో కొత్తవారిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న పలువురిపై వేటు వేసినట్లు చెప్పారు. వారిలో శ్రీకాకుళం డీసీసీ అధ్యక్షుడు నరేంద్ర పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వేటు వేసినట్లు బొత్స వెల్లడించారు. మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావుకు నరేంద్ర ప్రధాన అనుచరుడు. కాగా, అనంతపురం, కడప డీసీసీ అధ్యక్షుల రాజీనామాలు ఆమోదించినట్లు వివరించారు.