: మరో హాలీవుడ్ సినిమాలో అమితాబ్


ఆస్ట్రేలియన్-అమెరికన్ చిత్రం 'గ్రేట్ గట్స్ బై' తర్వాత మరో హాలీవుడ్ సినిమా కోసం మెగా స్టార్ అమితాబ్ రెడీ అవుతున్నారు. ఈ మేరకు బీబీసీ, స్టార్ ఫీల్డ్ ప్రొడక్షన్స్ అమితాబ్ ను సంప్రదించాయి. వికాస్ స్వరూప్ రచన సిక్స్ సస్పెక్ట్స్ ఆధారంగా ఈ హాలీవుడ్ సినిమాను తెరకెక్కించనున్నారు. అర్జెంటీనాకు చెందిన పాబ్లోట్రపెరో దీనికి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. అయితే, ఈ సినిమాలో అమితాబ్ ఏ పాత్ర పోషించనున్నారు? అసలు ఆయన ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించారా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News