: తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేయాలంటూ ఈసీకి ఫిర్యాదు
తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు అందింది. రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ స్పష్టమైన వైఖరి పాటించకుండా ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆరోపించింది. టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోందని.. ఈ నేపథ్యంలో ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఫ్రంట్ ప్రతినిధులు బెల్లయ్యనాయక్, గోసుల శ్రీనివాస్ తదితరులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ ను కలిసి కోరారు.