: అక్రమార్కుల నుంచి దేశాన్ని రక్షించడమే మా లక్ష్యం: కేజ్రీవాల్
కాసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మెట్రో రైలులో రామ్ లీలా మైదానానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతి, అక్రమార్కుల నుంచి ప్రజలకు విముక్తి కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఇప్పటివరకు చేసిన పోరాటం అధికారం కోసం కాదని, ఇక నుంచి చేసే పోరాటం మరో స్వాతంత్ర్య సంగ్రామమేనని ప్రకటించారు. ప్రమాణ స్వీకారానికి హాజరైన వారందరూ తమకు వీఐపీలేనన్న కేజ్రీవాల్ వీఐపీ పాసులు ఎవరికీ కేటాయించలేదని చెప్పారు. తన కుటుంబ సభ్యులు కూడా ప్రజల మధ్యే కూర్చుంటారన్నారు.