: సన్యాసం పుచ్చుకున్న సినీనటి రంజిత


సినీనటి రంజిత సన్యాసినిగా మారింది. బెంగళూరు శివారు బిడిదిలోని ధ్యానపీఠంలో గురువు నిత్యానంద సమక్షంలో సన్యాసం పుచ్చుకుంది. తన పేరును 'మా ఆనందమయి'గా మార్చుకుంది. ఇకనుంచి ధ్యానపీఠంలోనే నిరంతర సేవకురాలిగా ఉంటానని రంజిత చెప్పింది. సన్యాసినిగా మారటంతో ఆశ్రమ సేవకులకు పూర్తిగా సేవచేసే అవకాశం కలిగిందని ఆమె తెలిపింది. నిత్యానంద-రంజిత సన్నిహితంగా ఉన్నారంటూ రెండు సంవత్సరాల కిందట అభ్యంతరకర సన్నివేశాలతో ఉన్న కొన్ని సీడీలు బయటకు రావడంతో ఇద్దరూ చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. అనంతరం వీడియోలో వున్నది తాను కాదని పలుసార్లు తీవ్రంగా ఖండించిన రంజిత, బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అటు నిత్యానంద కూడా జైలు పాలయ్యారు. అప్పటినుంచి రంజిత ఆశ్రమంలోనే ఉంటూ ధ్యానం, భజనల్లో పాల్గొంటోంది.

  • Loading...

More Telugu News