: నేనూ అల్లర్ల బాధితుడినే.. నా వేదన వర్ణనాతీతం!: నరేంద్ర మోడీ
తాను కూడా గుజరాత్ అల్లర్ల బాధితుడినేనని... తాను అనుభవించిన బాధను మాటల్లో వర్ణించలేనని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన ఘటనతో తన గుండె బద్దలయిందని... వ్యక్తిగతంగా తాను ఎంతో వేదన అనుభవించానని చెప్పారు. కోర్టు తీర్పుతో తనను కమ్ముకున్న అసత్య మేఘాలు తొలగిపోయాయని తెలిపారు. దయచేసి కోర్టు తీర్పును మరో కోణంలో నుంచి చూడకండని మిత్రులకు, విరోధులకు విన్నవిస్తున్నానని చెప్పారు. తనలో విద్వేష భావాలు ఎన్నటికీ రాకుండా చూడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. తాజా తీర్పును తన వ్యక్తిగత విజయంగా తాను భావించడం లేదని మోడీ చెప్పారు. ఈ వివరాలను ఆయన తన బ్లాగు ద్వారా వెల్లడించారు.