: రైలు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా: రైల్వే మంత్రి
అనంతపురం జిల్లా కొత్త చెరువు రైల్వే స్టేషన్ వద్ద నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్ గ్రేషియాను రైల్వేశాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఇక క్షతగాత్రులకు ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్టు తెలిపారు.