: రైలు ప్రమాద ఘటన మృతుల్లో ఇద్దరు కర్నూలు జిల్లా వాసులు
అనంతపురం జిల్లా కొత్త చెరువు రైల్వే స్టేషన్ వద్ద నాందేడ్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఇద్దరిని అధికారులు గుర్తించారు. వీరు కర్నూలు జిల్లా ఆదోనీకి చెందిన బసవరాజు, సర్వమంగళంగా అధికారులు వెల్లడించారు. మిగిలిన మృతదేహాలు గుర్తు పట్టడానికి వీల్లేనంతగా కాలిపోయాయని తెలిపారు.