: దీనితో కొవ్వు తగ్గుతుందట
మన శరీరంలో బ్యాంకులో నగదు పేరుకుపోయినట్టుగా పేరుకుపోయే కొలెస్టరాల్ను తగ్గించడంలో ఒక రకమైన ఆల్గేకు చెందిన రసం చక్కగా తోడ్పడుతుందని పరిశోధకులు గుర్తించారు. మనం మనకు తెలియకుండానే ఎక్కువ కొలెస్టరాల్ ఉండే ఆహారం తీసుకుంటాం. ఇలాంటి సమయాల్లో మన శరీరంలో కొలెస్టరాల్ నిల్వలు పెరుగుతూ పోతాయి. అలాకాకుండా ఒక రకమైన శైవలాలు (ఆల్గే) సారంతో, కొలెస్టరాల్తో కూడిన ఆహార ప్రభావాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు ఒక పరిశోధనలో గుర్తించారు.
వేన్ స్టేట్ విశ్వవిద్యాలయం, భారత సంతతికి చెందిన స్మిత్ గుప్తా నేతృత్వంలో పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్తల బృందం ఆల్గే సారం ప్రభావాన్ని గుర్తించారు. ఇందుకోసం పరిశోధకులు జంతువులపై ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహించారు. వాటికి అధిక కొవ్వుతో కూడిన ఆహారంతోబాటు ఆల్గే సారాన్ని కలిపిన నీటిని కూడా ఒకే సమయంలో ఇచ్చి పరీక్షించగా, వాటి రక్తంలో కొలెస్టరాల్ స్థాయిలు తగ్గినట్టు తేలింది. అంతేకాదు, వాటి శరీరంలో చెడ్డ కొలెస్టరాల్ తగ్గి, మంచి కొలెస్టరాల్ మోతాదులు పెరగడం ఇందులో విశేషమని పరిశోధకులు చెబుతున్నారు.