: శుక్రవారం తాజ్ ను దర్శించాలంటే గుర్తింపుకార్డు కావాల్సిందే
ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం తాజ్ మహల్ ఆవరణలో శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొనాలనుకునే వారు తప్పని సరిగా గుర్తింపుకార్డు వెంటతెచ్చుకోవాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రార్థనల సమయంలో అనుమతి లేకున్నా విదేశీయులు తాజ్ ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో ఏఎన్ఐ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే దీనిపై తాజ్ మహల్ కమిటీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. దేశంతో సంబంధం లేకుండా ముస్లింలెవరైనా ప్రార్థనలు చేసుకోవచ్చని వాదిస్తోందీ కమిటీ. కొన్నాళ్ల క్రితం ముగ్గురు బంగ్లా దేశీయులతో ప్రార్థనలు చేయడంతో వివాదం రేగింది. ఏఎన్ఐ అధికారులు మాత్రం మసీదు కమిటీ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు.