: మందుకొట్టేందుకు 50 రూపాయలివ్వలేదని కత్తెరతో పొడిచేశాడు
మందు కొట్టేందుకు 50 రూపాయలు అడిగితే ఇవ్వలేదన్న కోపంతో, కత్తెరతో కడుపులో పొడిచేసిన ఘటన హైదరాబాద్ టోలీచౌకీ మిరాజ్ నగర్ లో చోటు చేసుకుంది. కారు డ్రైవర్ షేక్ మహ్మద్ రోడ్డు మీద వెళ్తున్న సులేమాన్ అలీఖాన్ ను మద్యం తాగేందుకు 50 రూపాయలు అడిగాడు. షేక్ మహ్మద్ ఎవరో తెలియని అలీఖాన్ డబ్బులు లేవన్నాడు. అంతే... తన దగ్గరున్న కత్తెరతో వెంటనే సులేమాన్ అలీఖాన్ కడుపులో పొడిచేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో ఉస్మానియా ఆసుపత్రిలో సులేమాన్ చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు షేక్ మహ్మద్ ను అరెస్టుచేసి రిమాండ్ కు తరలించారు.