: పవన్ కల్యాణ్ కి మరో అవార్డు


ఇటీవలి కాలంలో వరుసపెట్టి అవార్డులు కొట్టేస్తున్న పవన్ కల్యాణ్ తాజాగా మరో అవార్డును దక్కించుకున్నారు. 2013వ సంవత్సరానికి గాను పవర్ స్టార్ ఉత్తమ నటుడిగా అంతర్జాతీయ పత్రిక 'కాస్మోపాలిటన్' ప్రకటించిన అవార్డును గెలుచుకున్నారు. గత ఎడాది 'గబ్బర్ సింగ్'తో రికార్డుల బూజు దులిపిన పవన్, ఈ ఏడాది 'అత్తారింటికి దారేది' సినిమాతో తన స్టామినా మరోసారి చూపించాడు.

ఈ సినిమాలో పవన్ చూపిన హావభావాలకు నంది కూడా పవన్ సొంతమేనని అతని అభిమానులు భరోసాతో ఉన్నారు. కాగా ఇంటర్నేషనల్ 'కాస్మోపాలిటన్' మేగజీన్ ప్రకటించిన అవార్డుల ప్రకారం మోస్ట్ పాప్యులర్ యాక్టర్ గా సల్మాన్ ఖాన్ నిలవగా, మోస్ట్ పాప్యులర్ హీరోయిన్ గా కరీనా కపూర్ నిలిచింది. ఇటర్నేషనల్ ట్రెండ్ సెట్టర్ ఫిల్మ్ గా 'క్రిష్ 3' నిలిచింది. బెస్ట్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ షారూఖ్ ఖాన్ (చెన్నై ఎక్స్ ప్రెస్), బెస్ట్ హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ దీపికా పదుకొనే నిలిచారు.

బెస్ట్ బాలీవుడ్ డెబ్యూగా ధనుష్ నిలిచాడు. బెస్ట్ తమిళ్ యాక్టర్ గా విజయ్ (తలైవా) నిలిచారు. బెస్ట్ విలన్ గా క్రిష్ 3 లో నటించిన వివేక్ ఒబెరాయ్ నిలవగా, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, యాక్ట్రస్ గా సోను సూద్, దివ్యాదత్తా నిలిచారు. ఉత్తమ రొమాంటిక్ ఫిల్మ్ ఆషికీ 2 గా నిలిచింది. బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా ధూమ్ 3 అవార్డు గెలుచుకుంది.

  • Loading...

More Telugu News