: పసికందును చీమలకు వదిలేసిన మహాతల్లి!
అన్నెం పున్నెం ఎరుగని పసికందును చీమలపుట్టలో వదిలిపెట్టారు కసాయిలు. ఆడపిల్లగా పుట్టడం పాపమో పుణ్యమో కూడా తెలియని ఆ పసిపిల్లను అలా వదిలించుకోవడానికి మనసు ఎలా వచ్చిందో కానీ, పసికందును చీమల పుట్టలో వదిలేసిందో తల్లి. చీమలు కుడుతుండడంతో తట్టుకోలేక ఆ పసిపాప ఏడుపులంకించుకుంది.
దాంతో చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ ఘటన తమిళనాడులోని తేని గ్రామంలో చోటుచేసుకుంది. చీమల దాడిలో గాయపడిన పాపను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. చీమలు కుట్టడం వల్ల ఆమె శరీరంలోని పలు భాగాలు తీవ్రంగా వాచాయి. అయినప్పటికీ బాలిక త్వరగా కోలుకుంటోందని డాక్టర్లు తెలిపారు.