: తిరుగుపయనమైన ముఖ్యమంత్రి కిరణ్
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ పయనమయ్యారు. ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి కిరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని అభివృద్ధి పథకాలతో పాటు, సమైక్యవాదాన్నీ వినిపించారు.