: బీహార్ స్పీకర్ తో భేటీ.. విభజనపై అనుసరించే విధానాలపై చర్చ
రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ రోజు బీహార్ శాసనసభ స్పీకర్ ఉదయ్ నారాయణ చౌదరితో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజనపై అనుసరించాల్సిన విధానాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై శాసనసభలో చర్చ జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో విభజన జరిగిన రాష్ట్రాల స్పీకర్లతో నాదెండ్ల సమావేశమై చర్చలు జరుపుతున్నారు.