: డీకే అరుణ సభ రసాభాస


మహబూబ్ నగర్ జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ లో మంత్రి డీకే అరుణ సభ రసాభాసగా మారింది. పడకల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో అరుణ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చారు. సభ ప్రారంభం అయిన వెంటనే అక్కడకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ను ఈ కార్యక్రమానికి ఎందుకు ఆహ్వానించలేదంటూ ఘర్షణకు దిగారు. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేను పిలవరా? అంటూ నిలదీశారు.

అయితే, ఇది అధికారిక కార్యక్రమం కాదని... పార్టీకి చెందిన సమావేశమని అరుణ అనుచరులు చెప్పారు. అలాంటప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారంటూ టీడీపీ శ్రేణులు అక్కడే బైఠాయించి ధర్నాకు దిగాయి. పరిస్థితి విషమించడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

  • Loading...

More Telugu News