: పార్టీ పెడుతున్న మంద కృష్ణ మాదిగ


ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. ఆ పార్టీ వివరాలను జనవరి 4న అధికారికంగా ప్రకటిస్తామని మందకృష్ణ తెలిపారు. తమ పార్టీ సామాజిక న్యాయమే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ రోజు నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వివరాలు తెలిపారు. ప్రస్తుతమున్న అన్ని రాజకీయ పార్టీలకు తమ పార్టీ ప్రత్యామ్నాయం అవుతుందని చెప్పారు. రాజకీయాల్లో కొనసాగుతున్న కులాల ఆధిపత్యాన్ని తమ పార్టీ అంతమొందిస్తుందని అన్నారు. జనాభా దామాషా ప్రకారం అన్ని కులాల ప్రజల హక్కులను తాము ప్రారంభించబోయే పార్టీ కాపాడుతుందని మంద కృష్ణ చెప్పారు.

  • Loading...

More Telugu News