: షీలా దీక్షిత్, సుష్మా, పలువురు మాజీలకు ఆహ్వనాలు పంపుతున్న ఏఏపీ
దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకాబోతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతోంది. ఈ మేరకు ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, సుష్మాస్వరాజ్, మాజీ లెఫ్టినెంట్ గవర్నర్లు, నగరంలోని మాజీ ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నారు. అంతేకాక ఢిల్లీ బీజేపీ నేత హర్షవర్ధన్ కు కూడా ఆహ్వానం పంపుతున్నారు. అయితే, అన్నా హజారే, కిరణ్ బేడీ, సంతోష్ హెగ్డేలకు ప్రత్యేక ఆహ్వానాన్ని పంపాలని ఏఏపీ తమకు చెప్పిందని ఓ అధికారి తెలిపారు. కాగా, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అందరూ చూసే విధంగా వేదిక వద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.