: స్పానిష్ మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి జీవిత ఖైదు
ఇరవై ఆరేళ్ల స్పానిష్ మహిళపై అత్యాచారానికి పాల్పడిన మహ్మద్ భాషా అన్సారీ అనే వ్యక్తికి ముంబయిలోని ఓ స్థానిక కోర్టు జీవిత ఖైదు విధించింది. 2012 నవంబర్ లో ముంబయిలోని బాంద్రాలో తన ఇంటిలో ఉన్న మహిళను మహ్మద్ భాషా కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అతనిని అరెస్టు చేయగా విచారణ సాగింది. పలు నేరాల్లో ఇదే వ్యక్తిపై గతంలో అనేక కేసులు నమోదయ్యాయని కూడా పోలీసులు కనుగొన్నారు. ఈ మేరకు అతడిని నిందితుడిగా నిర్ధారించిన న్యాయస్థానం శిక్ష విధించింది.