: బాపట్ల వద్ద సముద్రంలో వాయుసేన ఉద్యోగి గల్లంతు
గుంటూరు జిల్లా బాపట్ల వద్ద సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సిబ్బందిలో ఒకరు ఈ రోజు సముద్రంలో గల్లంతయ్యారు. నలుగురు వాయుసేన ఉద్యోగులు మరపడవలో సముద్రంలో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అలల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వారు ప్రయాణిస్తున్న పడవ కుదుపులకు లోనైంది. దీంతో ఉద్యోగి నీటిలో పడిపోయాడు. ప్రస్తుతం వాయుసేన సిబ్బంది, మెరైన్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు.