: వెనక్కి తీసుకోకుంటే జగన్ కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తాం: గండ్ర
శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ పై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్రంగా ఖండించారు. వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని తెలిపారు. నిన్న(గురువారం) హైదరాబాదులో మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్.. 'అసెంబ్లీ స్పీకర్ కు అవగాహన, బుద్ధి, జ్ఞానం ఉందా' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.