: శివలాల్ యాదవ్ సోదరుడిపై దాడి
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఉపాధ్యక్షుడు శివలాల్ యాదవ్ సోదరునిపై హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ అకాడమీ డైరెక్టర్ కన్వల్జిత్ సింగ్ దాడి చేశారు. సికింద్రాబాదులోని కళాశాల మైదానంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. దీనిపై శివలాల్ యాదవ్ సమీపంలోని బేగంపేట పోలీస్ స్టేషన్ లో కన్వల్జిత్ సింగ్ పై ఫిర్యాదు చేశారు.