: బెయిల్ దరఖాస్తుపై రహస్య విచారణ కోరిన 'తెహల్కా' ఎడిటర్
బెయిల్ కోసం తాను పెట్టుకున్న దరఖాస్తుపై విచారణను రహస్యంగా జరిపించాలని రిమాండులో ఉన్న 'తెహల్కా' ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కోరారు. ఈ మేరకు ఆయన తరపు న్యాయవాది గోవాలోని జిల్లా సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై నేడు విచారణ జరిపిన కోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది. ఆ తర్వాత తేజ్ పాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ చేపడుతుంది. సంస్థలోని మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆరోపణలు రావడంతో తేజ్ పాల్ ను గోవా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.