: ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త అధ్యక్షుడు
ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త అధ్యక్షుడు నియమితులయ్యారు. ఈ మేరకు సంజయ్ సింగ్ ను పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమించారు. ఇంతవరకు అధినేతగా కొనసాగిన అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.