: సమర్థులైన వారి కోసం అన్వేషిస్తున్నాం: కేజ్రీవాల్
ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించిన విషయం విదితమే. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంత్రి వర్గం ఏర్పాటు విషయంలో తలమునకలై ఉన్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో ఐదుగురికి స్థానం కల్పించిన కేజ్రీవాల్.. మిగతా వారిని నియమించే పనిలో నిమగ్నమయ్యారు. నిజాయతీపరుల కోసం చూస్తున్నామని, సమర్థులైన వారికే కేబినేట్ లో స్థానం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఎవరిని తీసుకోవాలో నిర్ణయించేందుకు ఏఏపీకి ప్రత్యేక యంత్రాంగం ఉందని ఆయన తెలిపారు. రామ్ లీలా మైదానంలో ఎల్లుండి జరిగే ప్రమాణ స్వీకారోత్సవంలో వీఐపీలు ఎవరూ ఉండరని.. ప్రజలందరూ ఆహ్వానితులేనని ఆయన తేల్చి చెప్పారు.