: జానారెడ్డితో కేసీఆర్ భేటీ


రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సాయంత్రం 7.45 గంటలకు తమ పార్టీ ప్రజాప్రతినిధులతో కలసి రాష్ట్రపతిని కేసీఆర్ కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో, కేసీఆర్ జానారెడ్డితో భేటీ కావడం గమనార్హం. ఈ సమావేశానికి మంత్రులు సారయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ నేత హరీష్ రావు కూడా హాజరయ్యారు. టీబిల్లులో సవరణలు, రాష్ట్రపతితో చర్చించాల్సిన అంశాలపై వీరు చర్చిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News