: సునామీ మారణహోమానికి నేటితో తొమ్మిదేళ్లు


హిందూ మహా సముద్రంలో లేచిన ప్రళయ సునామీ 2.30లక్షల మందిని బలితీసుకుని నేటికి సరిగ్గా తొమ్మిదేళ్లు. 2004 డిసెంబర్ 26న సూర్యుడి ఉదయ కిరణాలు ప్రసరించే లోపే సునామీ భారత్, శ్రీలంక సహా తీర దేశాలను ముంచెత్తింది. 14 దేశాల్లోని 2.30లక్షల మంది నీటిలో కలిసిపోయారు. తెల్లవారు జామున విరుచుకుపడిన సునామీ ప్రభావానికి తీర ప్రాంతాలు రూపు రేఖలను కోల్పోయాయి. ఒక్క తమిళనాడులోనే 7వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో నాడు ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పిస్తూ.. తమిళనాడులోని చెన్నై, నాగపట్టణం, తిరునెల్వేలి తదితర ప్రాంతాల్లో నేడు స్మారక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హిందూ మహాసముద్ర గర్భంలో ఇండోనేషియా సమీపంలో వచ్చిన భూకంపమే నాటి పెను విలయానికి కారణం. అలాంటి విపత్తును ఎదుర్కోవడం భారత్ వంటి దేశాలకు అదే మొదటిసారి.

  • Loading...

More Telugu News