: జమ్మూ క్రికెటర్లకు అర్ధరాత్రి అనుభవం


జమ్మూ కాశ్మీర్ రంజీ క్రికెటర్లకు మంగళవారం రాత్రి ఊహించని అనుభవం ఎదురైంది. తెల్లారితే హైదరాబాద్ రంజీ జట్టుతో మ్యాచ్. కంటి మీద కునుకు పట్టడం లేదు. డోర్ లాక్ చేయలేదు. 1.15గంటలు అవుతోంది. పదుల సంఖ్యలో ఆయుధాలతో భద్రతా సిబ్బంది లోపలకు ప్రవేశించారు. ప్రశ్నలతో ఆరా తీశారు. మిలిటెంట్ కోసం గాలిస్తున్నామని చెప్పి వెళ్లిపోయారు. ఈ పరిణామంతో వారు భయపడిపోయారు. ఈ అనుభవాన్ని జమ్మూ కాశ్మీర్ రంజీ క్రికెటర్ సమీయుల్లా ఫేస్ బుక్ లో వెల్లడించారు.

  • Loading...

More Telugu News