: ఇటలీ గార్డులను పంపకుంటే తీవ్రంగా పరిగణిస్తాం: ప్రధాని
ఇటలీ నావికాదళ గార్డులను భారత్ కు పంపకుంటే తీవ్రంగా పరిగణిస్తామని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వారు తప్పకుండా తిరిగి రావాల్సిందేనని అన్నారు. లేకుంటే తీవ్రంగా పరిగణిస్తామని, దౌత్య సంబంధాలపైనా దీని ప్రభావం పడుతుందని చెప్పారు. ఈ మేరకు ప్రధాని లోక్ సభలో ఒక ప్రకటన చేశారు.
వారు తమ చర్యల ద్వారా దౌత్య నిబంధలన్నింటినీ ఉల్లంఘించారని అన్నారు. మరోవైపు, రెండు దేశాలూ ఈ సమస్యను పరిష్కరించుకోగలవని భారత్ లో ఇటలీ రాయబారి డానియెల్ మాన్సిని ఢిల్లీలో మీడియాతో అన్నారు. ఈ విషయంలో భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని చెప్పారు.