: గగన్ పహాడ్ లోని రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం... నలుగురు సజీవ దహనం
హైదరాబాద్, గగన్ పహాడ్ లోని రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.