: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతపురం జిల్లా టీడీపీ నేత పేరం నాగిరెడ్డి
టీడీపీ నేత పేరం నాగిరెడ్డి ఈరోజు (బుధవారం) కడప జిల్లా పులివెందులలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. నాగిరెడ్డి ఇంతకు ముందు అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా పనిచేశారు. సమైక్యాంధ్ర విషయంలో చంద్రబాబు ఇప్పటికీ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నారని.. అందుకే టీడీపీని వీడానని నాగిరెడ్డి అన్నారు. నాగిరెడ్డిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు వైఎస్ జగన్ చెప్పారు. తాడిపత్రి పట్టణంలో పార్టీ అభివృద్ధికి నాగిరెడ్డి పాటుపడతారని ఆయన ఆకాంక్షించారు.